నేను ఏ పార్టీ తరపున పోటీ చెయ్యను :జేడీ లక్ష్మినారాయణ

అమరావతి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని ఆయన ప్రకటించారు. తటస్తంగా ఉంటానని చెప్పారు. ప్రజాసేవఎన్జీవో కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని తెలిపారు. మరోవైపు, ఎన్నికల తర్వాత రాజకీయ ప్రవేశంపై ఆలోచిద్దామని తన సన్నిహితులతో లక్ష్మినారాయణ చెప్పినట్టు సమాచారం. టీడీపీ తరపున లక్ష్మినారాయణ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో టీడీపీ నేతలు కూడా భేటీ అయి, పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికే, ఎన్నికలకు దూరంగా ఉండాలని లక్ష్మినారాయణ నిర్ణయించుకున్నారు.