మా ఆయన రాజకీయాల్లోకి రాడు..!

మహేష్ బాబు కుటుంబంలో రాజకీయాలకు సంబందించిన నాయకులు ఉన్నారు . తండ్రి కృష్ణ మొదటి నుండి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరించడమే కాకుండా పార్లమెంట్ కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఇప్పుడేమో మహేష్ పెద్ద బావ గల్లా జయదేవ్ కూడా తెలుగుదేశం పార్టీ తరుపున గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అలాగే మహేష్ చిన్నాన్న కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరాడు.
దాంతో మహేష్ బాబు గురించి చర్చ మొదలయ్యింది.
అయితే మహేష్ బాబు రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చిచెప్పింది మహేష్ భార్య నమ్రత. మహేష్ కు సినిమాల గురించి ఆలోచనలు తప్ప రాజకీయాల గురించి ఆలోచించేంత సమయం లేదని, అలాగే ఆసక్తి కూడా లేదని భవిష్యత్ లో కూడా రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది నమ్రత.