రాజధాని భూములతో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం….. బీజేపీ చీఫ్ కన్నా !

సీఎం చంద్రబాబుపై రాజధాని అమరావతి భూములతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సంక్షేమ పథకాలన్నీ పచ్చ కండువా వేసుకున్న వారికే అందుతున్నాయని ఆరోపించారు. రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారే తప్ప… అందులో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని దుయ్యబట్టారు. రాజధానికి కేంద్రం రూ. 2500 కోట్లు ఇస్తే 4 భవనాలను కూడా నిర్మించలేదని, రాజధాని కోసం ప్రజల నుంచి సేకరించిన విరాళాలు ఏమయ్యాయని కన్నా ప్రశ్నించారు.

ఒకవైపు డబ్బులు లేవంటునే విలాసాలు చేస్తూ రూ. 1.30 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు.చంద్రబాబు చేసేది అధర్మ పోరాటమని ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపించారు. తమ అసమర్ధపాలన బయటపడుతుందని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అయన విమర్శించారు.