తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కి మరో గుర్తింపు..!

10

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 2019 ఇన్స్టిట్యూట్ అఫ్ ఎక్సలెన్స్ అవార్డు ను ఈ విద్యాలయం సొంతం చేసుకుంది. రాయపూర్ లో ఇందిరగనుంది విశ్వవిద్యాలయం లో జరిగిన వ్యవసాయ అధికారుల కార్యక్రమం లో ఈ అవార్డు ను భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్సీ అగర్వాల్, ఉపకులపతి ప్రవీణ్ రావు కు అందచేశారు. ఈ అవార్డు తమ విశ్వవిద్యాలయానికి రావడం తో అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేసారు.