గగనయాన్ లో ‘వ్యోమ మిత్ర’..!

11

ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గగనయాన్’ లో నలుగురు వ్యోమగాములు వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం వీరితో పాటు మరొక మహిళా రోబో ను కూడా పంపబోతున్నారు. అచ్ఛం మనుషులలానే మాట్లాడటం ఈ రోబో ప్రత్యేకత. ఈ రోబో కు వ్యోమ మిత్ర అని నామకరణం చేసారు. ఇది అన్ని రకాల పనులు చేస్తుందని, రెండు భాషలను మాట్లాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షం లో వెళ్లబోయే నలుగురు వ్యోమగాముల్లో ముగ్గురు పురుషులు ఉండగా, నాలుగో స్థానాన్ని ఈ వ్యోమమిత్ర పూరించబోతోంది.