రాజన్న ఆదాయం వారానికి కోటిన్నర

15

గతంలో ఎన్నడూ లేని విధంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి హుండీ ద్వారా 7 రోజుల్లో ఒక కోటి 51 లక్షల 48 వేల 667 రూపాయల నగదు లభించింది. 179 గ్రాముల బంగారం, 10 కిలోల 500 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు. మేడారం జాతర సందర్భంగాపెద్ద ఎత్తున భక్తులు రావటంతో రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది.