ముఖం చూసి.. చెప్పేస్తుంది!

30

దొంగ ఓట్లు అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో జరగనున్న పురపాలక పోరులో సరికొత్త టీయాప్‌ అనే సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇది దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. పింఛనుదారుల కోసం వినియోగిస్తున్న ఫేషియల్‌ రికగ్నీషన్‌ పరిజ్ఞానం ద్వారా ఈ విధానం అమలుకు కొంపల్లి పురపాలిక పరిధిలోని 13, 15, 16, 21,22, 23, 24, 27, 31, 32 వార్డులను ఎంపిక చేశారు. యాప్‌ వినియోగంపై రిటర్నింగ్‌ అధికారులకు నేడు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం కొత్తగా పది చరవాణులను కొనుగోలు చేస్తున్నారు.