ప్రపంచంలోనే పొడవైన కేకు

17

ప్రపంచలోనే పొడవైన కేకు కేరళలో తయారయింది. దీనికి గిన్నిస్ బుక్ లో చోటు లభించడం ఖాయమని ఈ కేకు తయారీలో ముఖ్యపాత్ర వహించిన నిర్వాహకులు చెబుతున్నారు. కేరళలో్ని 1,500 మంది బేకరీ తయారీ దారులు 6.5 కిలోమీటర్ల పొడవైన కేకును తయారు చేసారు. ఈ కేకు వెడల్పు 10 సెంటీమీటర్లు కాగా బరువు 27,000 కేజీలు. దీని తయారీకి 12,00 కేజీల చక్కెర, పిండిని ఉపయోగించారు. ఇంతవరకు చైనాలో 2018లో తయారు చేసిన 3.2 కిలోమీటర్ల కేకు మాత్రమే పొడవైన కేకుగా గిన్నిస్ బుక్ లో నమోదయింది.