కేరళ స్విమ్మర్ సాహసం

6

ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారిలో కేరళకు చెందిన స్విమ్మర్‌ కాళ్లూ చేతులు కట్టుకుని వివేకానంద స్మారక మండం వరకూ ఉన్న 800 మీటర్ల దూరం వరకూ ఈతకొట్టి పర్యాటకులను అలరించాడు. కేరళ కొల్లమ్‌ కరునాగపల్లికి చెందిన రతీష్‌కుమార్‌ (31) లండన్‌లో 34 కిలోమీటర్ల పొడవున్న ఇంగ్లీష్‌ కెనాల్‌లో కాళ్లూ చేతులు కట్టుకుని ఈతకొట్టే సాహసం చేయాలని నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో కన్నియాకుమారిలో వివేకానందస్వామి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడి సముద్రతీరంలో పూంపుహార్‌ బోట్‌ హౌస్‌ నుంచి వివేకానంద స్మారక మండపం దాకా కాళ్లూ చేతులు కట్టుకుని ఈతకొట్టేందుకు సిద్ధమయ్యాడు.