గంగాసాగర్ మేళాకు 50 లక్షల మంది భక్తులు

23

పశ్చిమ బెంగాల్‌లో అత్యంత వైభవంగా గంగాసాగర్ మేళా ప్రారంభమయ్యింది. మకర సంక్రాతి సందర్భంగా పవిత్ర పుణ్య స్నానాలు చేసేందుకు 50 లక్షల మంది భక్తులు మేళాకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేళా సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మేళాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హెలీకాప్టర్, డ్రోన్ల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా ప్రభుత్వం మేళాకు వచ్చే భక్తులకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది.