మోడల్ పై అత్యాచారం..!

161

హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది . ఒక మోడల్ పై ఇద్దరు యువకులు అత్యాచారానికి తెగబడ్డారు . బలవంతంగా సదరు యువతిని  మద్యం తాగించి , మత్తులో ఉండగా అత్యచారం చేసినట్లు తెలుస్తోంది . అంతటితో ఆగకుండా అత్యాచార దృశ్యాలను వారు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించినట్లు సమాచారం . ఈ దుర్ఘటన గత నెల 28 వతేదీన జరిగిందని , అదే రోజున తాను జూబ్లీహిల్స్  పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది .అయినా పోలీసులు తన ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించకుండా , కేసు నీరుగార్చే ప్రయత్నాన్ని చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది .

హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించిన విషయం తెల్సిందే . అత్యాచార ఘటన కేసుల్లో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది . దిశ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వెల్లువెత్తిన నిరసన, ఆందోళనల నేపధ్యం లో పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఏకంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చి, అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది . అయినా అత్యాచార ఘటనలు మాత్రం ఆగకపోవడం ఆందోళన కలిగించే అంశం. . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదో ఒక చోట ప్రతిరోజూ  అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని క్రైం రికార్డ్స్ గణాంకాలు చెబుతున్నాయి . 

దిశ హత్యచార నిందితుల  ఎన్ కౌంటర్ ద్వారా, చిన్నారులు  , ఆడవాళ్లపై  లైంగిక దాడికి పాల్పడాలనుకునే వారి ఆలోచనల్లో మార్పు వస్తుందని అందరూ భావించారు .  వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలు చూస్తుంటే, నిందితుల ఆలోచనల్లో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం అవుతోందని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు . భయం ద్వారానే మార్పు వస్తుందని భావించడం కంటే ,  ప్రాథమిక దశ నుంచే ప్రతి ఒక్కరిలో   నైతిక విలువలు నేర్పేందుకు చర్యలు తీసుకొవాలని సూచిస్తున్నారు .