ఉన్నావో అత్యాచారం కేసులో నేడు తుది తీర్పు!

15

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార ఘటనపై తుది తీర్పు వెల్లడించేందుకు ఢిల్లీ హైకోర్టు సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటల తరువాత ఉన్నావ్‌ అత్యాచార కేసుపై తీర్పును వెల్లడించనుంది. కేసులో పూర్తి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్‌ ధర్మేశ్‌ శర్మ తెలిపారు. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.