మహిళలు శబరిమల వివాదం పై సింగర్ జేసుదాసు సంచలన వ్యాఖ్యలు..!

27

మహిళలు శబరిమల వివాదం పై ప్రముఖ సింగర్ జేసుదాసు స్పందించారు. మహిళల ప్రవేశం పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు శబరిమల వెళ్ళడం మానుకోవాలి అని జేసుదాసు విజ్ఞప్తి చేశారు. మహిళల ప్రవేశం దీక్షలో ఉన్న స్వాముల నిగ్రహాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. పూర్వం మహిళలు దేవుళ్ళ ముఖం కూడా చూసేవారు కాదు అని జేసుదాసు చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని అన్నారు. జేసుదాసు వ్యాఖ్యలపై కొంతమంది మండిపడుతున్నారు.