భూమి కబ్జా చేశారని తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నం..!

13

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని తమ వ్యవసాయ భూమిని మోతుబరి రైతు కబ్జా చేసాడని బోయిన్ పేటకు చెందిన కొంతం తల్లి కూతుర్లు లక్ష్మి, స్వాతి ఆత్మహత్యాయత్నం చేశారు. సర్వే నెంబర్ 992లో తమకున్న 20 గుంటల భూమిని మోతుబరి రైతు కామోజ్జుల రామన్న కబ్జా చేసి తమను భూమిలోకి రానివ్వడం లేదని ఈ భూమి నాదే అని బెదిరిస్తున్నారని లక్ష్మి, స్వాతి చెబుతున్నారు. తమ తాతల నాటి నుండి భూమికి సంబంధించిన అన్ని రికార్డులను తమ పేరుమీద ఉన్నాయని అయినా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తమను రోజుల తరబడి తిపుతున్నారని తల్లీ కూతుళ్ళు చెబుతున్నారు. అధికారులకు తమ భూ రికార్డులను చూపించినా కూడా పట్టించుకోకుండా రోజుల తరబడి ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ వద్ద ఉంచుకొని పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం తమ వ్యవసాయ భూమిని భూస్వామి దున్నుతున్నాడని తెలుసుకున్న తల్లీకూతుళ్ళు అక్కడికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై చల్లుకొని ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వారి వద్దనున్న కిరోసిన్ స్వాధీనపరచుకుని అదుపులోకి తీసుకున్నారు