తప్పిన పెను ప్రమాదం..!

నల్గొండలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు…చర్లపల్లి కూడలి వద్దకు చేరుకోగానే ఇంజన్ లో లోపం తలెత్తి మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ గమనించి.. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ప్రయాణికులు బస్సు దిగి చూస్తుండగానే వారి కళ్లముందు క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది.