అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి అటెండర్‌ చంద్రయ్య మృతి..!

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన ఘటనలో మరొకరు మృతి చెందారు. విజయారెడ్డిని రక్షించడానికి ప్రయత్నించి తీవ్రంగా గాయుడ్డ కార్యాలయ అటెండర్‌ చంద్రయ్య…కంచన్‌బాగ్‌ DRDO ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారు జామున గుండెపోటు రావడంతో చంద్రయ్య ప్రాణాలు కోల్పోయారు. విజయారెడ్డి కాలిపోతున్న సమయంలో ఆమెను కాపాడబోయి చంద్రయ్య గాయాలపాలయ్యారు. అప్పటి నుంచి DRDO ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున ఒక్క సారిగా గుండె పోటు రావడంతో చంద్రయ్య మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.