కర్ణాటకం మరో మలుపు..! కాషాయ కండువా కప్పుకోనున్న రెబల్ ఎమ్మెల్యేలు

కర్నాటకలో అనర్హత వేటుకు గురైన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలు… రేపు కాషాయ కండువా కప్పుకోనున్నారు. వీరిలో కాంగ్రెస్ కు చెందిన 12 మంది, జేడీఎస్ కు చెందిన ముగ్గురు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కున్నప్పుడు వీరంతా బీజేపీకి మద్దతుగా రాజీనామాలు చేశారు. దీంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. ఫలితంగా వీరంతా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఎన్నికలో పోటీ చేయడానికి వీలు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికే వీరంతా రాజీనామా చేసినందున పార్టీ అధిష్ఠానం వీరి పట్ల సానుభూతితో ఉంది. రేపు వీరు బీజేపీలో చేరుతున్నారు. వచ్చే ఉప ఎన్నికలో వీరికే టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని నిర్ణయించింది.