పటేల్ జయంతి వేడుకల్లోప్రధాని మోదీ..!

గుజరాత్‌లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేవ ఐక్యతకు పటేల్ నిదర్శనమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్తికల్ 370 రద్దు పటేల్‌కు అంకితం చేస్తున్నామన్నారు. మనల్ని విడగొట్టేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ సందర్భంగా దాయాది దేశం పాకిస్తాన్‌కు హెచ్చరించారు మోదీ. శతృదేశాల కుటిల ప్రయత్నాలకు గట్టిగా సమాధానం ఇవ్వాలన్నారు. ఉగ్రవాదం వల్ల అనేకమంది తల్లులు తమ పిల్లల్ని కోల్పోయరన్నారు. మనసైనికులు పాకిస్తాన్ వారి భాషలోనే సమాధానం ఇస్తారన్నారు. ఐక్యత దినోత్సవం సందర్భంగా పారామిలిటరీ బలగాల విన్యాసాల్ని తిలకించారు. అందరిచేత జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు.