కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కారు తీపి కబురు అందించింది..!

213

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కారు తీపి కబురు అందించింది. దీపావళి వేళ.. వారికి 5 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీన్ని ఈ ఏడాది జూలై నుంచే వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే.. ప్రస్తుతం ఉన్న 12 శాతం డీఏ స్థానంలో ఉద్యోగులకు 17 శాతం డీఏ అందనుంది. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం డీఏను పెంచుతున్నట్లు తెలిపారు. దీనివల్ల 48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. డీఏ పెంపుతో ప్రభుత్వ ఖాజానాపై రూ.16వేల కోట్ల భారం పడతుంది.