పెయిన్ కిల్లర్ కంటే ‘బీరు’ పవర్ ఫుల్..!

373

కొంతమంది బీరు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. మరికొంతమంది మాత్రం బీరు తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు. బీరు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమే కానీ మితంగా తీసుకుంటే మాత్రం బీరు వలన చాలా ప్రయోజనాలే ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో బీరు తాగేవాళ్లలో కిడ్నీలో రాళ్ల అభివృద్ధి తగ్గుతుందని తెలిసింది.

బీరులో ఉండే సిలికాన్ ఎముకల సాంద్రతను పెంచి ఎముకలను బలంగా ఉంచుతుంది. బీరు తక్కువ మోతాదులో తీసుకుంటే మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. బీరు మెదడు, గుండె, మెడ భాగాలలో రక్తం ప్రవాహంలో గడ్డ కట్టకుండా చేస్తుంది. బీరు కంటిలో ఏర్పడే శుక్లాలను కూడా తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా మరియు ధృడంగా పెరగటంలో కూడా బీరు సహాయపడుతుంది.

బీరు తాగేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని ఒక పరిశోధనలో తేలింది. గ్రీన్ విచ్ యూనివర్సిటీకు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధనల్లో తలనొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గటానికి పారాసెట్మాల్ లాంటి పెయిన్ కిల్లర్ కంటే బీరు తాగడం మేలు అని తేలింది. గ్రీన్ విచ్ వర్సిటీ పరిశోధకులు 400 మందిపై 18 అధ్యయనాలు చేసిన తరువాత ఈ విషయం గురించి వెల్లడించారు.రోజుకు రెండు గ్లాసుల బీరు తీసుకోవటం వలన రక్తంలో 0.08 శాతం ఆల్కహాల్ లెవెల్ పెరుగుతుంది. బీరులో ఉండే ఆల్కహాల్ నొప్పి తీవ్రతను తగ్గించటంతో పాటు శరీరానికి నొప్పిని తట్టుకునే ఉపశమనం ఇస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని పెయిన్ కిల్లర్ల కంటే బీరు బాగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలింది. కానీ అదే సమయంలో బీరు తాగడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని పరోశోధకులు చెబుతున్నారు. బీరు మితంగా తాగితే ఎటువంటి సమస్యలు ఉండవు కానీ అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు.