ఇద్దరు అల్లుళ్లతో అత్త అక్రమ సంబంధం..!

4332

ఓ మహిళ వావి వరుసలు మరిచి లైంగిక సుఖం చేసిన పనితో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఓ గ్రామానికి చెందిన మహిళకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేసింది. అయితే కొడుకుల్లా చూసుకోవాల్సిన ఇద్దరు అల్లుళ్లతోనే ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. అల్లుళ్లు తరుచూ ఏ కారణం లేకుండా ఇంటికి వస్తుండటంతో అనుమానం వచ్చిన మామ ఆరా తీయగా వీరి బండారం బయటపడింది.

పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో గ్రామంలో పరువు పోతుందన్న ఆవేదనతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళకు సమీప బంధువైన ఆవుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆమెను హెచ్చరించాడు. అల్లుళ్లలతో అక్రమ సంబంధం పెట్టుకుని కూతుళ్ల సంసారాలను నాశనం చేయొద్దని కోరాడు. దీంతో తన సుఖానికి అడ్డు పడుతున్నాడని ఆ మహిళ తన ఇద్దరు అల్లుళ్లతో కలిసి ఆగస్టు 9న అతడిని హత్య చేయించింది. మృతుడి భార్య ఆవుల సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అప్పటినుంచి సుగుణమ్మకు నిందితుల బంధువుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ ముగ్గురిపై కేసులు వెనక్కి తీసుకోకపోతే నీ ముగ్గురి పిల్లలతో పాటు నిన్నూ చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ సుగుణమ్మ సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మిని కలిసి మొర పెట్టుకున్నారు. తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన ఎస్పీ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.