అడవుల్ని ధ్వంసం చేయడం కరెక్ట్ కాదన్న నాగబాబు

సువిశాలమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై సెలబ్రిటీల్లో చైతన్యం రావడంతో మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ స్పందించారు. తాజాగా, మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

అడవుల్ని ధ్వంసం చేసి మైనింగ్ చేయడం అనేది సరికాదని హితవు పలికారు. ప్రకృతిని కాపాడుకోవాలని, నల్లమలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, change.org వెబ్ సైట్లో ఆన్ లైన్ పిటిషన్ కు సైనప్ చేయాలని కూడా పర్యావరణ ప్రేమికులకు సూచించారు.

https://twitter.com/NagaBabuOffl/status/1172444565418070018