బిగ్ బాస్ ఇంట్లో అయోమయం

69

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తోంది. బిగ్ బాస్-3 రియాల్టీ షోలో తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిగ్ బాస్ ఇంట్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్న మహేశ్ విట్టా ఒక్కసారిగా తన బట్టలు సర్దుకోవడంతో ఇంటి సభ్యులు షాక్ కు గురయ్యారు. బాబా భాస్కర్ ఏమైందని అడగ్గా, నేనేం బాధపడడంలేదు మాస్టర్ అంటూ మహేశ్ తన ట్రాలీ సూట్ కేసు తీసుకుని మెయిన్ ఎగ్జిట్ వద్దకు రావడం బిగ్ బాస్-3 లేటెస్ట్ ప్రోమోలో చూడొచ్చు.

అసలేం జరుగుతుందో అర్థంకాక అయోమయంలో ఉన్న ఇతర ఇంటి సభ్యులు కూడా మహేశ్ వెంబడి ఎగ్జిట్ వద్దకు రావడం ప్రోమోలో కనిపించింది. అయితే, దీనికంతటికీ కారణం బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కే. తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు ఇతర కంటెస్టెంట్లందరికీ మహేశ్ విట్టా చెప్పాల్సి ఉంటుంది. దీనికి కొనసాగింపు తెలుసుకోవాలంటే ఇవాళ్టి బిగ్ బాస్-3 లేటెస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే!