రెచ్చిపోయిన పునర్నవి, అషు రెడ్డి..!

105

ఎప్పుడూ గొడవలు, అరుచుకోవడాలతో నిండిన బిగ్‌బాస్‌ హౌస్‌.. బుధవారం నాటి ఎపిసోడ్‌లో తమ టాలెంట్‌ను ప్రదర్శించారు హౌస్‌మేట్స్‌. డ్యాన్సులు, సింగింగ్‌, యాక్టింగ్‌తో తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా పునర్నవి, అషూలు వేసిన స్టెప్పులు వైరల్‌ అవుతుండగా.. రాహుల్‌ పాట, అలీరెజా వేసన స్టెప్పులు, రవికృష్ణ గెటప్‌ హైలెట్‌ కాగా.. శివజ్యోతి మ్యాజిక్‌ అంటూ చేసిన పని సోషల్‌ మీడియాలో ఫన్‌ క్రియేట్‌ చేశాయి.

టాలెంట్‌ షో పేరిట ఓ టాస్క్‌ను ఇచ్చిన బిగ్‌బాస్‌ .. ఆ కార్యక్రమానికి బాబా, శ్రీముఖిలను న్యాయనిర్ణేతలుగా వ్యవహరించాలని తెలిపాడు. ఇక ఈ టాలెంట్‌ షోలో హౌస్‌మేట్స్‌ అందరూ తమ ప్రతిభను ప్రేక్షకులకు చూపించారు. నా పేరు సూర్య చిత్రంలోని ఇరగ ఇరగ అనే పాటకు పునర్నవి వేసిన ప్టెప్పులు అదిరిపోయాయి. హౌస్‌లో ఎప్పుడూ మూడీగా ఉంటూ.. టాస్క్‌లో పార్టిసిపేట్‌ చేయకుండా ఉండే పున్నరవి.. ఈ టాస్క్‌లో చేసిన పర్ఫామెన్స్‌తో అందరి నోళ్లు మూయించింది. ప్రస్తుతం ఆమె వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇంతవరకు షోలో ఎక్కువగా హైలెట్‌ కానీ అషూ సైతం తన క్యూట్‌ స్టెప్పులతో అందర్నీ మెప్పించింది. రంగస్థలంలోని జిగ్‌లే రాణి పాటకు డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. తనకు డ్యాన్స్‌ రాదని, చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు కూడా డ్యాన్స్‌ అంటే తల్లిదండ్రులు కూడా వద్దనే వారని, రాకపోయినా.. ప్రయత్నిస్తున్నానని తన గురించి చెప్పుకున్న అషూ.. తన స్టెప్పులతో అదరగొట్టింది. మ్యాజిక్‌, లాజిక్‌ అంటూ శివజ్యోతి చేసిన పని.. అందరికీ నవ్వును తెప్పించింది. అగ్గిపెట్టెలో పట్టే చీర అంటూ అగ్గిపెట్టెలో చీరను దూర్చింది. దీంతో హౌస్‌మేట్స్‌ పగలబడి నవ్వారు.

అలీ రెజా తన సిక్స్‌ప్యాక్స్‌ను హైలెట్‌చేస్తూ వేసిన స్టెప్పులకు సైతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. రవికృష్ణ వేసిన గెటప్‌కి కూడా పాజిటివ్‌ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇక నేటి ఎపిసోడ్‌లో మళ్లీ ఈ టాలెంట్‌ షో కంటిన్యూ కానట్టు తెలుస్తోంది. అలీ రెజా చేస్తున్న పర్ఫామెన్స్‌కు శివజ్యోతి మళ్లీ పాతాళగంగలా మారినట్లు కనబడుతోంది. అలీరెజా-మహేష్‌ల మధ్య మళ్లీ మాటలయుద్దం జరిగినట్లు తెలుస్తోంది. టాలెంట్‌ షో టాస్క్‌లో చివరికి విన్నర్‌గా ఎవరు నిలుస్తారో చూడాలి.