ప్రేమలో మునిగిన జంటకు మరణ శాసనం…!

పెరూ దేశంలోని ఓ జంట ప్రేమ పారవశ్యంలో ముగినిపోయి.. ఓ బ్రిడ్జిపై ముద్దాడుకుంటున్నారు. అయితే బ్రిడ్జి రెయిలింగ్‌పై కూర్చున్న మహిళ ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఇద్దరూ కింద పడి చనిపోయారు. వివరాల్లోకి వెళితే…పెరూలో పర్వతారోహకులుగా పనిచేస్తున్న ఎస్పినోజ్, హెక్టర్ విడాల్ అనే జంట క్యూసో పట్టణంలో టూరిస్టు గైడ్లుగా పనిచేస్తున్నారు. అయితే ఒక రోజు పని పూర్తయిన తర్వాత అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వెళ్తూ, మార్గమధ్యంలోని బెత్లెహాం వంతెనపై ఆగారు. ప్రేమ పారవశ్యంలో ఇద్దరూ ముద్దాడుకుందామని బ్రిడ్జి రెయిలింగ్ కు ఆనుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియలేదు. ఒక్కసారిగా మహిళ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె ప్రియుడు కూడా అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి జారిపోయారు. ఇంకేముంది సుమారు 50 అడుగుల పై నుంచి కింద పడటంతో ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె ప్రియుడు సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించాడు .