కర్ణాటకలో కూలిన సంకీర్ణ ప్రభుత్వం…!

80

కర్ణాటకలో జేడీఎస్ – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బలనిరూపణలో కుమారస్వామి ప్రభుత్వం విఫలమైంది. జేడీఎస్ – కాంగ్రెస్‌కు బలనిరూపణలో 99 ఓట్లు రాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. గత వారంరోజులుగా నడిచిన అసంతృప్తుల రాజకీయం ఈ రోజుతో ముగిసింది. ముంబయిలోని ఓ స్టార్ హోటల్ వేదికగా అసమ్మతి రాజకీయం నడిచింది. 15 ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత మూడువారాలుగా కర్ణాటక రాజకీయం అనేక మలుపులు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. విధానసభలో బలపరీక్ష జాప్యం చేసినా ఫలితం దక్కలేదు. 2018 మే నెలలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరింది. 14 నెలలకే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. సీఎం పదవిని కుమారస్వామి రెండో సారి కోల్పోయాడు. 2004లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కమారస్వామి సీఎంగా పనిచేశారు.