కోహ్లీ కొంటె చేష్టలు.. వీడియో షేర్ చేసిన ఐసీసీ!

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆట ఎలా సాగుతున్నా తన ఉత్సాహంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. గేమ్ ను ఆస్వాదించడమే కాదు, అప్పుడప్పుడు తన ట్రేడ్ మార్క్ అల్లరితో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. తాజాగా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయి అందరూ టెన్షన్ గా ఉన్న సమయంలో కూడా కోహ్లీ తన అల్లరిని వదిలిపెట్టలేదు. టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను అనుకరిస్తూ ప్రాక్టీసు పిచ్ పై బౌలింగ్ చేసి నవ్వులు పూయించాడు. బుమ్రాలాగే షార్ట్ రనప్, బుమ్రాను తలపించేలా వికెట్ సెలబ్రేషన్ తో కోహ్లీ తాను ఇమిటేషన్ మాస్టర్ నని నిరూపించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

https://twitter.com/ICC/status/1148890229018939392