హ్యాపీ బర్త్ డే గంగూలీ..

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేడు 47వ ఏట అడుగు పెట్టాడు. 1972 జూలై 8న జన్మించిన గంగూలీ.. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, విజయాల బాట పట్టించాడు. అప్పటి వరకు ఉన్న సాదాసీదా టీమ్‌కు దూకుడు నేర్పించాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోని లాంటి గొప్ప ప్లేయర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన దాదా.. తన ప్రత్యేకమైన శైలితో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. తీసుకునే నిర్ణయాల్లో, ఆడే ఆటలో దూకుడు తగ్గించని గంగూలీ.. దాని ఫలితంగా ఒడిదొడుకులను కూడా ఎదుర్కొన్నాడు. 2002లో ఇంగ్లండ్ గడ్డపై ఆ దేశంతో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన అనంతరం గంగూలీ షర్టు విప్పి తన వ్యక్తిత్వంలో ఎంత కసి ఉందో తెలియజెప్పాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత జట్టు జయకేతనం ఎగురవేయగానే.. స్టాండ్స్‌లో ఉన్న గంగూలీ షర్టు విప్పి గిరగిరా తిప్పి, ఎప్పటికీ మర్చిపోలేని అద్భుత ఘట్టాన్ని భారత క్రికెట్ అభిమానులకు అందించాడు.

sourav ganguly, happy birthday sourav ganguly, happy birthday dada, happy birthday, sourav ganguly birthday, sourav ganguly birthday celebration, ganguly, ganguly birthday status, happpy birthday sourav ganguly, sourav ganguly birthday whatsapp status, happy birthday sourav ganguly (dada), birthday sourav ganguly, birthday, dada birthday, sehwag post on ganguly birthday,ganguly birthday video, గంగూలీ, సౌరబ్ గంగూలీ, మాజీ కెప్టెన్ గంగూలీ, హ్యాపీ బర్త్ డే, సెహ్వాగ్, సెహ్వాగ్ ట్వీట్, సెహ్వాగ్ ట్విట్టర్

ఆ తర్వాత 2003 వరల్డ్ కప్‌లో భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లి తనేంటో నిరూపించిన గంగూలీ భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు. అప్పటి వరకు జట్టుకు ఎందరో కెప్టెన్లు వచ్చారు.. పోయారు.. కానీ, గంగూలీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు భారత క్రికెట్ దేదీప్యమానంగా వెలిగింది. దాన్ని ధోని కొనసాగించి.. టీమిండియాను టాప్ పొజిషన్‌లో ఉంచాడు.

ఇదిలా ఉండగా, నిన్న ధోని పుట్టిన రోజు సందర్భంగా మిస్టర్‌ కూల్‌కు వెరైటీగా విషెష్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.. ఈ రోజు గంగూలీకి కూడా వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. లార్డ్స్‌లో షర్టు విప్పి విక్టరీని ఎంజాయ్ చేస్తున్న గంగూలీ ఫోటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే 56″ కెప్టెన్. 56 ఇంచుల ఛాతి. 7వ నెల,8వ తేదీ.. 7*8=56, వరల్డ్ కప్ యావరేజ్ 56’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. రీట్వీట్లు, లైకులతో హోరెత్తింది.