నేను నగ్నంగా నటించిన వారు నన్ను బాగా చూసుకున్నారు !

అమలాపాల్ లేటెస్ట్ మూవీ ‘ఆడై’ ద్వారా ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా కనిపించిన సంగతీ తెలిసిందే. అహంకారం, సాహసం, కళాత్మక మనస్తత్వం గల కామిని ప్రేక్షకులకు ఏ స్థాయిలో వినోదం పంచబోతోంది అనేది ఈ ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయ్నం చేశారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అమలా పాల్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి.

‘ఆడై’ షూటింగ్ సమయంలో నేను చాలా సేఫ్‌, సెక్యూర్‍గా ఫీలయ్యాను. ఎందుకంటే 15 మంది టెక్నీషియన్స్ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ‘పంద్రాలి'(15 మంది భర్తలు కలిగిన మహిళ) అనే ఫీలింగ్ వచ్చింది అంటూ అమాలా పాల్ వ్యాఖ్యానించారు. ఆడై’ ట్రైలర్ సంచలనం రేపుతోంది. ఇందులో అమలా పాల్ విచ్చలవిడి మనస్తత్వం గల, ప్రతి విషయానికి బెట్టింగ్ కట్టే యువతిగా కనిపించబోతోంది.

అబ్బాయిలతో కలిసి తిరుగుతూ, ధూమపానం, మద్యపానం చేస్తూ… మహిళగా తనకు లభించిన స్వేచ్ఛను దుర్వినయోగం చేస్తున్న యువతిగా కనిపించింది. ట్రైలర్‌లోని ఓ సీన్లో…. అబ్బాయిలతో మందు కొడుతూ కనిపించిన కామిని ‘మనమంతా పుట్టుకతోనే బట్టలేసుకుని పుట్టామా? అన్నీ విప్పేసి నగ్నంగా ఉంటేనే నిజమైన బర్త్ డే డ్రెస్’ అంటూ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.