ఆస్ట్రేలియాలో ప్రభాస్, శ్రద్ధా

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ఇటీవలే హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ‘పబ్’ సెట్లో ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు. ప్రభాస్ – శ్రద్ధా కపూర్ పై మరో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. 

ఈ పాటలను ఆస్ట్రేలియాలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. వచ్చేవారంలో ఈ సినిమా టీమ్ అక్కడికి బయలుదేరనుందని సమాచారం. ఆస్ట్రేలియాలో చిత్రీకరించనున్న ఈ రెండు పాటలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేవేనని అంటున్నారు. ఇక ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమనే నమ్మకంతో ఆయన అభిమానులు వున్నారు.