ఆఫీస్ బాయ్ గా పనిచేశాను: ‘జబర్దస్త్’ నవీన్

చాలాకాలం క్రితమే తెలుగు చిత్రపరిశ్రమకి వచ్చిన నవీన్, చాలా సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేశాడు. అయినా అవేవీ ఆయనకి పెద్దగా పేరు తీసుకురాలేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. “ఇండస్ట్రీకి రావడానికి ముందు నేను ఆఫీస్ బాయ్ గా పనిచేసేవాడిని. ఆఫీసంతా ఊడవడం .. టేబుళ్లు తుడవడం .. టీలు తీసుకురావడం .. ఫైలింగ్ వంటి పనులను చేశాను.

 చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు కొనుక్కోవడం కోసం పనిచేశాను. నేను ఆఫీస్ బాయ్ గా చేరిన ఆఫీసులోనే ఎదుగుతూ వచ్చాను. ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నాను. షూటింగు వున్నప్పుడు మాత్రం అనుమతి తీసుకుని వెళుతుంటాను. 650 రూపాయలతో మొదలైన నా జీతం ఇప్పుడు పాతికవేలకి చేరుకుంది” అని చెప్పుకొచ్చాడు.