హెచ్ఐవీ వుంది అని చెప్పిన వదలని కామాంధుడు..!

కళ్లకు కామం పొరలు కప్పిన దుర్మార్గులు ఏ చట్టానికీ భయపడ్డం లేదు. చివరకు ప్రాణాంతక రోగాలను కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు. తనకు హెచ్ఐవీ వైరస్ సోకిందని చెప్పినా వినకుండా ఓ నీచుడు కాటేశాడు. ఓ మహిళను మందులపై డిస్కౌంట్ ఇప్పిస్తానని డాబా పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

పథకం ప్రకారం ఆమెతో మాటామాటా కలిపి పరిచయం పెంచుకున్నాడు. తాను ఆ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నానని నమ్మించాడు. ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా వున్నాయా అని ఆరాలు తీశాడు. అందుకామె ఔనని చెప్పింది. అదే అదునుగా భావించాడు.. ఆస్పత్రిలోని పై అంతస్తులో ఉన్న డిపార్ట్‌మెంట్‌లో ఫామ్ నింపితే మందులు, ట్రీట్‌మెంట్‌లో డిస్కౌంట్ ఇస్తారని బాధితురాలిని నమ్మించాడు. డాబాపైన ఎవరూ లేకపోవడం చూసి  ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనకు హెచ్ఐవీ వుందని చెప్పినా వినిపించుకోకుండా పశువులా ప్రవర్తించాడు. బాధితురాలు శారీరకంగా బలహీనంగా ఉండటంతో ప్రతిఘటించలేకపోయింది. తర్వాత దగ్గర్లోని సియాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అతని పేరు దీపక్ (31) అని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని పోలీసులు తెలిపారు .