బాలకృష్ణకి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన మానసిక వైద్యం:రామ్ గోపాల్ వర్మ

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ పేరు వింటేనే కాంట్రవర్సీ గుర్తుకొస్తుంది. తన వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద సినిమాలతో తరచూ వార్తల్లో ఉండే వర్మ.. ఈ మధ్య ఎందుకో టీడీపీని, చంద్రబాబుని బాగా టార్గెట్ చేస్తున్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ చంద్రబాబుని నెగటివ్ గా చూపిస్తూ సినిమా తీశారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసి ఆ సినిమాకు ప్రమోషన్ చేసుకున్నారు. కానీ ఆ సినిమా ఏపీలో విడుదల కాకపోవడంతో.. వర్మ చంద్రబాబు మీద విమర్శల డోసుని మరింత పెంచారు. ఏపీలో పోలింగ్ ముగిశాక కూడా వర్మ చంద్రబాబుపై విమర్శలు ఆపట్లేదు.

చంద్రబాబు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తూ వర్మ విమర్శలు చేస్తున్నారు. ‘వావ్.. చంద్రబాబు వైసీపీలో చేరారు’ అంటూ జగన్ చంద్రబాబుకి వైసీపీ కండువా కప్పుతున్నట్లు ఉన్న ఎడిట్ చేసిన ఫోటోని పోస్ట్ చేశారు. ‘కేఏ పాల్ టైం అయిపోయింది.. కొత్త కేఏ పాల్ వచ్చారు’ అంటూ చంద్రబాబు బిల్ గేట్స్ గురించి చెప్తున్న వీడియోను పోస్ట్ చేశారు. అయితే తరువాత పోస్ట్ లో వర్మ మరింత హద్దు దాటారు. ‘జగనన్న ప్రభుత్వంలో శత్రువులకు కూడా మంచి చేస్తున్నాం’ అని రాసున్న ఒక ఫోటోని పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో చంద్రబాబుకి 3000 ఫించన్, లోకేష్ కి గ్రామ సచివాలయంలో జాబ్, బ్రాహ్మణికి అమ్మ ఒడి ద్వారా 15000, బాలకృష్ణకి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం’ అని రాసి ఉన్నాయి. అయితే వర్మ.. ‘బాలయ్యకి మెరుగైన వైద్యం కాదు.. మెరుగైన మానసిక వైద్యం’ అని పోస్ట్ చేశారు. అయితే వర్మ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు వర్మపై మండిపడుతున్నారు.