దేవుడంటే మా పవర్ స్టార్ ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఒక్క మాట వింటే యువత రక్తం ఉరకలేస్తుంది. ఇక మెగా ఫ్యాన్స్ కైతే చొక్కాలు చించుకునేంత హుశారు వచ్చేస్తుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో పెద్దగా ప్రభావం చూపించలేదు. నిజం చెప్పాలంటే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత జస్ట్ ఓకే అనిపించుకుంది.

పవన్ కళ్యాణ్ కు క్రేజ్ తీసుకొచ్చిన మొదటి సినిమా సుస్వాగతం. ఆ సినిమాతోనే యూత్ లో ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమతో పవన్ రేంజ్ పెరిగింది. తొలిప్రేమ వచ్చిన తర్వాతనే తమ్ముడు సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా చాటింది.

పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్.. కాని ఆ పేరుని పవన్ కళ్యాణ్ గా మార్చారు. ఆ తర్వాత ఫ్యాన్స్ అతనికి పవర్ స్టార్ స్క్రీన్ నేం ఇచ్చారు. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారారు. తమ్ముడు తర్వాత పూరి జగన్నాథ్ తో బద్రి సినిమా మళ్లీ పవన్ క్రేజ్ ను పెంచేసింది. అప్పట్లో యూత్ ఆడియెన్స్ కు పవన్ ఒక ఐకాన్. అందుకే ఆయన సినిమాలంటే యూత్ ఆడియెన్స్ ఎగబడి చూసేవారు.

ఇక పవన్ సూపర్ హిట్ మూవీస్ లో ఖుషి ఒకటి. ఎస్.జె.సూర్య డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు కొనాళ్ల పాటు హిట్టు దక్కలేదు. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం ఇలా వరుస ఫ్లాపులు వచ్చాయి. అయితే త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన జల్సా సినిమా హిట్ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ పులి, తీన్ మార్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే బాలీవుడ్ దబాంగ్ మూవీ రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ మళ్లీ బాక్సాఫీస్ పై పవర్ స్టార్ స్టాంప్ వేసింది.

పవర్ స్టార్ హిట్టు సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గబ్బర్ సింగ్ ఆకలితీర్చి బాక్సాఫీస్ షేక్ అయ్యేలా చేసింది. ఇక ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమా కూడా రికార్డులను సృష్టించింది. వెంకటేష్ చేసిన గోపాలా గోపాల సినిమాలో పవన్ నటించారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే పవన్ అందించడం విశేషం. ఆ తర్వాత కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు చేశాడు పవన్.

ఓ పక్క సినిమాలు చేస్తూనే జనసేన పార్టీ స్థాపించి 2019లో ఏపి ఎన్నికల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్. మాములుగా ఓ స్టార్ హీరోకి అభిమానులు ఉంటారు. కాని పవన్ లాంటి హీరోకి భక్తులుంటారు. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిన విషయమే. ఎన్నికల్లో జనసేన ఫలితం ఎలా ఉన్నా మళ్లీ పవర్ స్టార్ సినిమాల్లో నటించాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.