‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కసి కనిపించింది..

అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్. మొదటి సినిమా ఆశించిన ఫలితం దక్కలేదు..కాకపోతే ఈ సినిమాలో పవన్ చేసిన సాహసాలకు మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. చేతివేళ్లపై కారును తీసుకు వెళ్లడం..ఒంటిపై ఐస్ ముక్కలు కొట్టించుకోవడం ఇలా ఎన్నో సాహసకృత్యాలు ఈ సినిమాలో చూపించారు. పవన్ కళ్యాన్ కెరీర్ కొత్తలో ఇబ్బందులు పడుతున్నాడని.. మోహమాటం ఎక్కువ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. దాంతో నటుడిగా తానేంటో నిరూపించుకోవాలనే ధృడ సంకంల్పంతో నటనపై ఎక్కువ దృష్టి సారించారు.

ఆ తర్వాత పవన్ నటించిన సుస్వాగతం, తమ్ముడు సినిమాలో మంచి హిట్ అందుకున్నాయి. ఇక పవన్ నటించిన తొలిప్రేమ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కనబరిచిన నటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి వరుస విజయాలు అందుకోవడం మొదలు పెట్టాడు. బద్రి, ఖుషి సినిమాలతో పవన్ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో మెగా అభిమానులు పవన్ నే ఎక్కువగా ఫాలో కావడం మొదలు పెట్టారు.

ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం పవన్ ని కలవర పరిచింది. ఇదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కసి కనిపించింది. ఈ సినిమాలో పవన్ పంచ్ డైలాగ్స్, ఫైట్స్, కామెడీ అన్నీ దుమ్మురేపాయి. బాలీవుడ్ లో సల్మాన్ నటించిన దబంగ్ సినిమా రిమేక్ ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమాతో పవన్ స్టార్ ఇమేజ్ పదింతలు పెరగడమే కాదే..ఆయనలో మరో కోణాన్ని కూడా వెలుగు లోకి తీసుకువచ్చింది. మొదటి నుంచి పవన్ సామాజిక సేవ పట్ల ఎక్కువ దృష్టి పెట్టేవారు..సమాజానికి చేతైనంత సహాయం చేయాలనే స్వభావం పవన్ కళ్యాన్ ది కావడం..అదే సమయానికి సార్వత్రిక ఎన్నికలు రావడం జరిగింది.

ఇక ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సామాన్యుడిగా వెళితే కుదరదని..’జనసేన’ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి ఎంతో ఆదరణ లభించింది. ప్రజల కోసం అధికార పార్టీని ఎన్నోసార్లు నిలదీశారు పవన్ కళ్యాన్. మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన విషయం తెలిసిందే.