ఉపాసనని పొగడ్తలతో ముంచెత్తిన శ్రీరెడ్డి!

సంచలన కామెంట్స్ చేస్తూ వివాదాస్పద నటి గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రెడ్డి..తనకు మెగా ఫ్యామిలీ లో ఎవరంటే ఇష్టమో తెలిపి షాక్ ఇచ్చింది. మొదటి నుండి కూడా మెగా ఫ్యామిలీ అంటే అసలు ఇష్టపడిన ఈమె.తరుచు మెగా ఫ్యామిలీ ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఈమెకు అసలు పడదు. అలాంటిది మెగా ఫ్యామిలీ సభ్యురాలైన ఉపాసన అంటే ఇష్టమని తెలిపింది.

‘ఆశ్చర్యకరంగా చిరంజీవి కుటుంబంలో ఒక వ్యక్తిని నేను ఎంతగానో ఇష్టపడతాను. మచ్చలేని వ్యక్తి, స్ఫూర్తిప్రదాత. ఎవరో చెప్పగలరా’ అంటూ ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి ప్రశ్న అడగటం తరువాయి కింద కామెంట్లను అందుకున్నారు.రామ్ చరణ్ అని ఒకరు, అల్లు అర్జున్ అని మరొకరు సమాధానాలు ఇచ్చారు. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్, శిరీష్ ఇలా అందరి పేర్లు కామెంట్లలో కనిపించాయి. ఆఖరికి కొంత మంది పవన్ కళ్యాణ్ అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. కానీ వాళ్లందరికీ షాక్ ఇస్తూ చరణ్ భార్య ఉపాసన కొణిదెల పేరు చెప్పింది.

‘అవును, ఆ వ్యక్తి ఈవిడే. నాకు ఎంతో దగ్గరైన వ్యక్తిగా భావిస్తాను. గొప్ప వ్యక్తి, స్వీట్, వినయ విధేయత కలిగిన వ్యక్తి, కష్టపడే తత్వం, ఎంతో సరదాగా ఉంటుంది, ఫ్యామిలీ లేడీ, సక్సెస్‌ఫుల్ లేడీ. ఆవిడ ఎవరో కాదు స్ఫూర్తినిచ్చే మహిళ ఉపాసన రెడ్డి కామినేని’ అంటూ మరో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఈ పోస్ట్‌లో ఉపాసన కొణిదెల అని రాయకుండా ఉపాసన రెడ్డి కామినేని అని రాసి క్రీమ్ బిస్కెట్ వేసేంది.