“లక్ష్మీస్ ఎన్టీఆర్”కు భారీ ఆఫర్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను తీస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. తాను రాజకీయ ప్రయోజనం కోసం ఈ సినిమాను తీయట్లేదని, నన్ను చంపినా ఈ సినిమా విడుదల మాత్రం ఆగదని స్పష్టం చేశాడు వర్మ. ప్రస్తుతం ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రైట్స్ కోసం ఓ సంస్థ 8 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం.

తాజాగా ఈ సినిమాకు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఎంహెచ్ స్టూడియోస్ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాని అవుట్ రేట్ టోటల్ రైట్స్ తీసుకుంటామని ముందుకు వచ్చిందట. అయితే వాళ్లు ఎంత ఆఫర్ చేశారనే విషయం మాత్రం తెలియలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చల కోసమీ వర్మ ముంబైకి వెళ్లారు. ఈరోజు డీల్ ఫైనల్ చేసుకొని హైదరాబాద్ కి తిరిగొస్తారని తెలుస్తోంది. రెండ్రోజుల్లో సినిమా సెన్సార్ కు వెళ్లనుంది. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సరైన సినిమాలు కూడా లేకపోవడం “లక్ష్మీస్ ఎన్టీఆర్”కు కలిసొచ్చే అంశం. ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలకు బ్రేక్ పడుతుందని అంతా భావించారు. కానీ సినిమా విడుదల తేదీనే కాకుండా సినిమా విడుదల సమయాన్ని కూడా వర్మ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మార్చి 22న 12 గంటలకు సినిమా విడుదలవుతుందని, ఎన్టీఆర్ లక్కీ నెంబర్ కు, మార్చి 22 కు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీకి సంబంధాన్ని చూపిస్తూ లెక్కలేసి మరీ ట్వీట్ చేశారు వర్మ.