ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై చింత‌మ‌నేని శృతి త‌ప్పిన ఆరోప‌ణ‌లు..! ల‌య త‌ప్పిన సవాళ్లు..!!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఇచ్చిన కౌంట‌ర్ దారి త‌ప్పింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోప‌ణ‌ల‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా స్ర్కిప్టు రాసిచ్చిన వాళ్లు స‌రిగా రాయ‌లేదంటూ, త‌ప్పులు చ‌దివారంటూ, పవ‌న్ క‌ళ్యాణ్ అంత‌టి పెద్ద‌మ‌నిషి అల్ప‌జీవైన త‌న‌గురించి మాట్లాడి మంచి ప్రాచూర్యంలోకి తెచ్చార‌ని చెప్పుకొచ్చారు. వాస్త‌వ అంశాన్ని ప‌క్క‌న పెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌స్తావిస్తూ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించ‌డం అందుకు మీడియా పెద్ద‌యెత్తున హాజ‌ర‌వ్వ‌డం చూసి చింత‌మ‌నేని మురిసిపోయారు.

గంట సేపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న గురించి మాట్లాడాడ‌ని ఉప్పొంగి పోయారు. ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను రిపీట్ చేసుకుంటూ ఆత్మ‌త్రుప్తి ప్ర‌ద‌ర్శించారు. స్వ‌త‌హాగా చింత‌మ‌నేని ప్రెస్ మీట్ అంటే మీడియా హ‌డావిడి మామూలుగా ఉండేది. అదే వ‌ప‌న్ క‌ళ్యాణ్ పై కౌంట‌ర్ ప్రెస్ మీట్ అనే స‌రికి మీద ఎక్కువ సంఖ్య‌లో హాజ‌రైంది. అది స‌మ‌జ‌మే..! ఉన్న‌త స్థాయి వ్య‌క్తుల గురించి సామాన్య స్థాయి వ్య‌క్తుల విలేకరుల స‌మావేశం అంటే కాస్త హైప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. అందునా ఆరేళ్ల పిల్లాడి ద‌గ్గ‌ర‌నుండి అర‌వై ఏళ్ల వృద్ధుడి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే పిచ్చ క్రేజ్ ఉంటుంది.

అలా క్రియేట్ అయిన హైప్ చూసి చింత‌మ‌నేని కి గుబులుపుట్ట‌న‌ట్టుంది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌స్తావించిన విష‌యాల‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా నీళ్లు న‌మిలే ప్ర‌య‌త్నం చేసారు. తాను నియోజ‌క వ‌ర్గంలో ఎంతో సౌమ్యుడ‌న‌ని చెప్పుకోవ‌డ‌మే కాకుండా అన్ని మాతాలు, కులాల ప‌ట్ల స‌మ‌భ‌వంతో మెలుగాతాన‌ని చెప్పుకొచ్చారు. అలా చెప్పుకొచ్చిన చింత‌మ‌నేని ఆర్డీవో వ‌న‌జాక్షిపై ఎందుకు అంత అమానుషంగా దాడి చేసాడో చెప్ప‌లేదు. దెందులురు ప‌క్క గ్రామంలో పొలాల‌ను నాశ‌నం చేస్తూ కొత్త‌గా అక్ర‌మ ర‌హ‌దారి వేస్తున్న‌ప్పుడు అడ్డుకున్న ద‌ళితుల‌ను ఎందుకు చిత‌క బాదించారో చెప్ప‌లేదు.

నీరు ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా త‌న‌ నియోజ‌క వ‌ర్గంలో ఎన్ని బావుల‌ను, ఎన్ని చెరువుల‌ను మూసేయించారో కూడా చెప్ప‌లేదు. ఇక కేసులు గురించి వ‌ల్లె వేసిన చింత‌మ‌నేని త‌న‌పై ఉన్న అట్రాసిటి కేసుల ప్ర‌స్థావ‌న తీసుకురాలేదు. ఎంత‌సేపూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడ‌టం ఓ క్రేజీ గా భావించి, త‌న్మ‌య‌త్వం చెందుతూ మాట్లాడిన‌ట్టు ఉంది త‌ప్ప సీరియ‌స్ నెస్ ఎక్క‌డా క‌న‌ప‌డ‌లేదు. ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేక‌న్నా ప‌వ‌న్ పేరును ప్ర‌స్థావించ‌డ‌మే అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ నామ స్మ‌ర‌ణ చేయ‌డం కోస‌మే ప్రెస్ మీట్ అన్న‌ట్టు చింత‌మ‌నేని స‌మావేశం సాగిపోయింది.

ఇక చింత‌మ‌నేని మీద ఆయన నియోజ‌క‌వ‌ర్గంలోనే దాదాపు న‌ల‌బై కేస‌ులు రిజిస్ట‌ర్ అయితే కేవలం మూడు కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయ‌ని మీడియా సాక్షిగా చెప్ప‌డం దేనికి నిద‌ర్శ‌నం. కేసుల‌కు సంబందించిన వివ‌రాల‌ను ఎఫ్ఐఆర్ నంబ‌ర్ ల‌తో స‌హా బ‌హిర్గ‌తం చేస్తే చింత‌మ‌నేని మొహం ఎక్క‌డ‌పెట్టుకుంటాడ‌ని జ‌న‌సైనికులు ప్ర‌శ్నిస్తున్నారు. పైగా త‌న‌లోని రెండో కోణాన్ని ప‌వ‌న్ చూడ‌లేద‌ని చూస్తే అలా ప్ర‌స్తావించి ఉండి ఉండేవాడు కాద‌ని బ‌ల్లగుద్ది మ‌రీ చెప్పారు. ఇంత‌కీ త‌న రెండో కోణం గురించి వివరిస్తూ అది చాల సౌమ్యంగా ఉండే కోణ‌మ‌ని, పంట‌పొలాలు, ఫామిలీ, జంతు, ప‌క్షి ప్రేమికుడే త‌న‌లోని రెండో కోణంగా అభివ‌ర్ణించుకున్నారు చింత‌మ‌నేని.

ఇక్క‌డ జంతు ప్రేమికుడు అంటే ఎడ్ల పందాలు, ప‌క్షి ప్రేమికుడు అంటే కోళ్ల పందాలు అని, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఎవ‌రిని అడిగినా చెబుతారు. ఆ వ్య‌స‌నాన్ని కూడా మంచి అల‌వాట్లుగా క‌ల‌రింగ్ ఇచ్చ‌కునే ప్ర‌య‌త్నం చేసారు చింత‌మ‌నేని. అంతే కాకుండా ప‌వ‌న్ అంత‌టి వాడు త‌న‌ని హిట్ల‌ర్ తో పోల్చ‌డం సంతోషంగా ఉంద‌ని చింత‌మ‌నేని పేర్కొన్నారు. తాను దెందులూరు అనే చిన్న నియోజ‌క వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత మ‌ని, అడాల్ఫ్ హిట్ల‌ర్ ప్ర‌పంచాన్ని శాశించాల‌ని చూసాడ‌ని చెప్పుకొచ్చారు. హిట్ల‌ర్ తో త‌న‌ని పోల్చి త‌న స్థాయిని పెంచార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చింత‌మ‌నేని క్రుత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చివ‌ర‌గా అదే దెందులూరు నియోజ‌క వ‌ర్గంలో త‌న‌పై పోటీ చేసి గెలిస్తే రాజ‌కీయాల‌నుండి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని చెప్పుకొచ్చారు.

మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి కౌంట‌ర్ గా సాగిన విలేక‌రుల స‌మావేశం లో ప‌వ‌న్ స‌వాలుకు ప్ర‌తిస‌వాల్ విసురుదామ‌ని భావించిన చింత‌మ‌నేనికి పెద్ద హీరో అక‌స్మాత్తుగా తార‌స‌ప‌డితే ఎలా త‌న్మ‌య‌త్వం చెందుతామో అచ్చు అలానే ప‌వ‌న్ పేరు జ‌పిస్తూ బావోద్వేగానికి గురైయ్యారు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చౌద‌రి. చింత‌మ‌నేని ఉద్వేగం గ‌మ‌నించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర్వ‌ాత ఎప్పుడైనా ఆయ‌న గురించి స్పందించాల్సి వ‌స్తే “అరే సాంబా ఆయ‌న గురించి నువ్వే నాలుగు ముక్క‌లు చెప్పుకోరా.. మ‌నం వ్య‌క్తుల స్థాయిని పెంచ‌డం ఎప్పుడో మానేసాం”.. అని ప్రస్తావించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.