అయ్యో..అక్కడ అర్జున్ రెడ్డి ఆగిపోయింది..!

టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి. అయితే ఆ చిత్రాన్ని అటు హిందీలో ఇటు తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా తమిళ్ లో మాత్రం బాల దర్శకత్వం వహించాడు. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్రానికి తమిళ్ లో వర్మ అనే టైటిల్ పెట్టారు.
అయితే సినిమా మొత్తం రష్ చూసుకున్నాక ఆశించిన స్థాయిలో సినిమా లేదని రిలీజ్ వాయిదా వేశారు. ఇక చాలా సన్నివేశాలను వేరే దర్శకుడితో మళ్ళీ రీ షూట్ చేయాలనీ డిసైడ్ అయ్యారట మేకర్స్. దర్శకుడిగా బాలకు తిరుగులేని ఇమేజ్ ఉంది కానీ ఇది యువతరానికి నచ్చే సినిమా కానీ అలా చిత్రీకరించలేదని అందుకే బాల స్థానంలో మరొకర్ని తీసుకొని రీ షూట్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇది ఖచ్చితంగా వివాదాన్ని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది.